Pages

Saturday, June 27, 2009

గడియార స్థంభం -సృజన మధుర జ్ఞాపకం!

నరసరావు పేటలో ఊరి మధ్యలో గడియారం స్థంభం ఉండేది. అదొక పెద్ద లాండ్ మార్క్. దాని ఎదురుగా పర్మినెంట్ చలివేంద్రం ఉండేది డయాగ్నల్ గా! గడియారం స్థభం కి చుట్టూ అనేక హోటళ్ళు.ఒకవైపు చాకలి స్లోపు(అదొక సందు అంతే! దాన్ని స్లోపు అని ఎందుకంటారో నాకు తెలీదు)40 ఏళ్ళబట్టీ ఉన్న స్టూడెంట్స్ ఫ్రెండ్స్ పుస్తకాల షాపు ఇంకా అక్కడే ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ మధ్య! మరో పక్క మునిసిపల్ ఆఫీసుకువెళ్ళే దారి. ఎడమవైపు ఒరవకట్ట(ముస్లిములుండే ప్రాంతం)కి వెళ్ళే దారి మసీదు సందుతో ప్రారంభం అవుతుంది. వెనకగా శివుడి బొమ్మ సెంటరు.(ఇదివరలో దీన్ని గాంధీ చౌక్ అనేవారు.శివుడొచ్చాక గాంధీని పట్టించుకోడం మానేశారు అంతా).


ఈ మధ్య ఏడాది క్రితం వెళ్ళినపుడు అక్కడ అంతా బోసిగా ఉంది. ఆ ప్రాంతం అంతా సైకిళ్ళు,స్కూటర్లు, రిక్షాలు, ఆటోలు పార్క్ చేసి ఉన్నాయి.మధ్యలో గడియారం స్థంభం మాత్రం లేదు. నిట్టనిలువునా కూల్చేశారట. చెప్పలేనంత బాధ వేసింది.ఎందుకు కూల్చారో, ఎవరు కూల్చారో గానీ వాళ్లకు కలిసొచ్చిన స్థలమేదీ లేదు, ఒక మధుర జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం తప్పించి. ఆ స్థంభంతో, మా వూరితో సృజన గీతం సృజనా రామానుజన్ అనుబంధం ఇదిగో....!

గడియార స్థంభం - ఒక ఙ్ఞాపకం

మా నాన్నగారు ఒకసారి ఊరికి వెళ్ళాలంటే నేను వెంటా పడ్డాను. నాకు అప్పుడు ఆరేళ్ళుంటాయి. ఇంట్లో నాయనమ్మ, అన్నయ్యా ఉన్నా ఎందుకో నాకు అప్పుడు నాన్న వెళ్తుంటే దిగులుగా అనిపించింది. సరే అని నాన్న నన్ను కూడా తీసుకెళ్తానన్నారు. వెళ్ళేది ఏ ఊరో కూడా తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంఛే దూర ప్రయాణాలంటే చాలా ఇష్టం. అందులోనూ రైల్లో సింగిల్ సీటు ఉన్న వైపు కూఛోడం చాలా బాగుంటుంది ఇప్పటికీ.


సగం దూరం వెళ్ళాక తెలిసిమ్ది నాకు వేళ్ళేది నరసరావుపేట అనే ఊరికి అని.


"నాన్నా! ఆ ఊరు పెద్దదా?" అడిగాను. "లేదమ్మా చిన్న ఊరే," న్నారు. కొంచం ఆశ్చర్యపోయాను. "చిన్నదంటే ఎంత ఊరు నాన్నా? మన ఇల్లంత ఉంటుందా?" అని అడిగా. దానికి నాన్న నవ్వి, చూద్దువు." అన్నారు.


ఒక చిన్న ఊరంటే ఎంతుంటుందబ్బా అనుకుంటూ నాన్న ఇచ్చిన బొమ్మల పుస్తకం తీసుకుని చదూకుంటూ కూచున్నాను. మొత్తానికీ నా నిరీక్షణ ఫలించి ఎలాగోలా సాయంత్రానికి ఆ ఊరు చేరాం. మా ఇల్లంత చిన్నది కాక పోయినా మా వైజాగు కన్నా ఖచ్చితంగా చిన్నదే అని ఆ రైల్వే స్టేషన్ చూసి అర్థం అయింది.


నాన్న స్నేహితుడైన శర్మ గారింటికి వెళ్ళే దారిలో నాను జాగ్రత్తగా అన్నీ పరిశీలిస్తుంటే నాకో పేద్ధ భవంతి కనబడింది. అదేంటో కనుక్కుందామని నాన్నని అడిగితే దాన్నే గడియారస్థంభం అంటారని, ఆ ఊళ్ళో ఒక ల్యాండ్ మార్కని చెప్పారు. అదెందుకో పొడుగ్గా ఉండి నాకు కాస్త నచ్చింది.


అక్కడ శర్మగారి పిల్లలతో ఆ రోజుకి ఆడుకున్నా. మర్నాడు వాళ్ళ అమ్మాయితో స్కూలుకి కూడా వెళ్ళాను. సాయంత్రం రాగానే నన్ను ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి చూపించమన్నాను. అంతకు ముందు నేను నాన్న తో చెన్నై, బాంబే వెళ్ళి ఉన్నాను. అలాగే ఈ ఊళ్ళో కూడా బీచి ఉంటే చూపించమన్నాను. శర్మ గారు నవ్వి, మా ఊళ్ళో బీచి లేదు కానీ మనందరం కాసేపు బజారుకెళ్ళి ఏమన్నా కొనుక్కుందాం అని అన్నారు.


ముందు అందరం కలసి ఏదో పార్కుకి వెళ్ళాము. నాకది అంతగా నచ్చలేదు. వీజీపీ గోల్డన్ బీచి, వైజాగు బీచీ చూసిన నాకు అది పెద్ద గొప్పగా అనిపించలేదు కానీ చాలా మంది పిల్లలు అక్కడ హుషారుగా ఆడుకుంటూ కనిపించారు.


అక్కడి నుంచీ ఒక షాపులోకి వెళ్ళాం. అక్కడ కొన్ని బొమ్మలు చూశాం. శర్మగారు, "చందూ (రామచంద్రాచార్యులు), అమ్మలుకి నేను బొమ్మ కొనిపెడతాను. నువ్వు కాదంటే ఒప్పుకోను ," అన్నారు.


ఈ అమ్మలూ తుమ్మలూ నాకు నచ్చవు స్వామీ అందామనుకున్నా ఏదో పాపం బొమ్మ కొనిపెడతానన్నారు కనుక అలా క్షమించేశాను. అక్కడ కొన్న బొమ్మ ఒక కుందేలు, దాని వీపు మీద పిల్ల. నాకది భలే నచ్చింది. తల్లి కుందేలు, పిల్ల కుందేలు. భలే అనుకున్నాను. అందుకే నాకు బాగా నచ్చిందేమో!

దాన్ని గట్టిగా పట్టుకుని నాన్న భుజానెక్కి నేను సగర్వంగా అలా వాళ్ళతో మళ్ళా ఆ గడియారపు స్థంభం సెంటరుకి వెళ్ళాను. "మీ ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగులు లేవేంటీ?" అన్నా. "మాది చిన్న ఊరుకదమ్మా. అందుకే చిన్న చిన్న బిల్డింగులే ఉంటాయి," అన్నారు శర్మగారు.


"సృజీ, మీది పెద్ద ఊరా?" అడిగింది స్వప్న. శర్మగారమ్మాయి. "అవును," అన్నా గర్వంగా. "అంటే మా ఇల్లంత ఉంటుందా?" అందా అమ్మాయి ఆశ్చర్యంగా. నాన్న పెద్దగా నవ్వారు. నా ప్రశ్న గుర్తొచ్చి.


"ఇదిగో గడియార స్థంభం సెంటరు. ఇక్కడ బేకరీలో ఏదన్నా తింటావా?" అన్నారు శర్మగారు. కానీ నేను ఆ గడియార స్థంభాన్నే తదేకంగా చూస్తూ నించున్నాను. "నాన్నా! నన్నక్కడ ఫొటో తియ్యవా?" అడిగాను. నాన్న కెమేరా బయటకి తీసి నన్ను తీసుకెళ్ళి అక్కడ నించో పెట్టి ముందు స్వప్నతో, తరువాత సింగిల్ గా రెండు శ్నాప్స్ తీశారు.


"ఏంటా పోజు? నువ్వేమన్నా విక్టోరియా మహారాణివనుకుంటున్నావా?" శర్మగారు నవ్వుతూ అన్నారు ఫొటో అయ్యాక.


"అవును. తను నా లిటిల్ ప్రిన్సెస్," నాన్న అన్నారు.


ఆ రాత్రికే మా ప్రయాణం వైజాగుకి. ఇప్పటికీ ఆ బొమ్మ ఉంది నా దగ్గర. అలాగే అక్కడ తీసిన ఫొటో గురించి!!!


ఆ పోటో ఒక రకంగా ఉండేది. ఆ లైటింగు ఎఫెక్టుని నాన్న ఎలా తీసుకొచ్చారో తెలీదు కానీ చాలా స్టైలిష్ గా, నేను తల ఎత్తుకుని ఇచ్చిన పోజుని బాగా కాప్చర్ చేశారు. అది రెండు కాపీలుండేవి.ఒకటి ఇప్పటికీ నాన్న డెస్క్ మీద ఫ్రేములో భద్రంగా ఉండగా మరొకటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో పోయింది. అది ఎప్పుడూ నా పుస్తకాల్లో ఉండేది. నేను ఇంటర్మీడియేట్ లో హాస్టల్ లో ఉన్నా కొన్నాళ్ళు. ఒకబ్బాయి నేను ఐలవ్యూ చెప్పలేదని ఫస్టియర్ పరీక్షల ముందు నా పుస్తకాల్ని సైడు కెనాల్లో పడేశాడు. మాథ్స్ నోట్స్ లో ఉన్న ఆ ఫోటో నాకు కాకుండా పోయింది.


నాకైతే చాలా బాధనిపించింది. ఎప్పుడన్నా గుర్తొస్తే బాధగా ఉంటుంది. నాన్నకి బాగా నచ్చిన ఫొటో అది. నా వెనుక గడియారస్థంభం బ్యాక్ గ్రౌండ్.


ఈ మధ్య చంటి నన్ను ఆ ఫొటో కాపీ అడిగాడు. నాన్న నవ్వుతూనే దాన్ని ఇవ్వనన్నారు. బయటకు తీస్తే పోతుందని. "ఫొటో నా దగ్గర ఫిజికల్ గా ఉండకపోవచ్చు కానీ దాన్ని చూసిన అనుభూతి చెరిగిపోదు లెండి," అన్నాడు.


నాకూ అనిపించింది. అవును ఆ ఫొటో నా దగ్గర లేదు కానీ ఆ ఙ్ఞాపకం ఎప్పుడూ నాతోనే ఉంటుంది కద. :-)


అదండి. నా నరసరావుపేట గడియారస్థంభం ఙ్ఞాపకం. ఎందుకో చిన్న ఊరే కానీ, నాకు బాగానే నచ్చింది. ఎక్కువ దూరం వెళ్ళాకుండానే అన్నీ దొరుకుతాయని, నీటి సౌకర్యం ఎక్కువనీ, వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందనీ, శర్మగారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళేటప్పుడు నాన్నతో అన్నారట.


ఈ మధ్య ఈ పేట్రియాట్స్ చదివాక, నాకు ఆ చిన్ననాటి ఙ్ఞాపకం గుర్తొచ్చింది. నా అనుభూతినీ పంచుకుందామనీ.

***

24 comments:

Unknown said...

o miru ivi kudaa raastunnara? chala bagundi srujana gari gnapakam. chakkani anubhutini kaligimcimdi.

"సృజీ, మీది పెద్ద ఊరా?" అడిగింది స్వప్న. శర్మగారమ్మాయి. "అవును," అన్నా గర్వంగా. "అంటే మా ఇల్లంత ఉంటుందా?" అందా అమ్మాయి ఆశ్చర్యంగా. నాన్న పెద్దగా నవ్వారు. నా ప్రశ్న గుర్తొచ్చి.

చైతి said...

Thanks. chaalaa baagundi. akkada unnatte anipinchindi.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది సృజన గారు, చిన్న చిన్న విషయాలు కూడా బాగా గుర్తు పెట్టుకుని పంచుకున్నారు మా ఙ్ఞాపకాలను తట్టి లేపారు.

ముఖ్యం గా పార్క్. మొదటి సారి మా పార్క్ అందించిన ఆనందాన్ని, వాటర్ ఫౌంటేన్ అందాన్ని, అందులో గంతులు వేస్తూ ఆడుకున్న రోజులను, సాయంత్రం మొక్కలకి నీళ్ళు పోస్తుంటే వచ్చే తడిమట్టి వాసన ను ఎప్పటికీ మరచిపోలేను. నాకెందుకో మరి వీజీపీ, వైజాగ్ బీచ్ ఎన్ని చూసినా, మా పార్కే గొప్ప గా అనిపిస్తుంది :-) బహుశా ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయి ఉండచ్చు. అదే బాల్యం గొప్పతనమేమో!

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
మీ వూరి జ్ఞాపకాలను మీరూ పంచుకోవచ్చుగా ఇక్కడ! ప్రపంచంలో నరసరావు పేట వాళ్ళెక్కడున్నా, ఆ వూరితో వారి అనుబంధాన్ని ఇక్కడ పంచుకోవచ్చు. ఎవరైనా సరే!

సుజ్జి said...

very very nice srujana.. kundelu bommaa..!! :)

durgeswara said...

మాది నరసరావు పేట కాదుగాని ఆవూరితో నాకెంతో అనుబంధం వుంది . మానాన్న గారు ఎనిమిది సంవత్సరాలు దేచవరం లో ఉద్యోగం చేశారు.మా అమ్మమ్మవాల్లు లింగంగుంట్లలో ఉంటారు కనుక ,నేను నరసారవుపేట అంతా ,కలదిరుగుతుండేవాడిని. ఆగడియార స్థంభము ,శివుని విగ్రహము ,గాంధి పార్కు న చిన్నతనం ఆటలు ,స్మృతులలో అలా పదిలంగా వున్నాయి.

ప్రియ said...

చాలా హృద్యంగా ఉంది మీ అనుభవం. చిన్ననాటి అనుభూతులు జీవిత కాలం మరువలేము. మీ కుందేలు బొమ్మ చాలా ముద్దుగా ఉంది. ఇప్పటికీ అంత పదిలంగా ఉంచుకున్నారంటేనే అది మీకెంత ఇష్టమో నాకు అర్థం అయింది.

మీకిష్టమైన ఫొటోని కోల్పోవటం నాకూ బాధగా అనిపించింది.

లండన్ లో బిగ్ బెన్ ని తీసేయరే. మరి ప్రజల జన జీవనంతో అంతలా పెన వేసుకున్న గురుతుల్ని కూలగొట్టటం భాధాకరం. ఇక్కడా ఒక ఓక్ వృక్షాన్ని కూలగొట్టాలనే ఆలోచన ఉందని జనం వద్దని ఎదురు తిరుగుతున్నారు. కూలగొట్టాలనే ఆ మేయర్ కారణం అది హిట్లర్ నాటాడాని.

మీగడియార స్థంభం కథ నాకు నచ్చింది.
***

"ఫొటో నా దగ్గర ఫిజికల్ గా ఉండకపోవచ్చు కానీ దాన్ని చూసిన అనుభూతి చెరిగిపోదు లెండి," అన్నాడు.

Ultimate కదా!

సుజాత గారూ,

ఙ్ఞాపకాలు పదిలం మన హృదయంలో. మీ గడియార స్థంభం మీ ఙ్ఞాపకాలలో పదిలం. హృద్యమైన అనుభూతిని అందించారు. ధన్య్వాదాలు.

Nobody said...

--->"నాన్నా! ఆ ఊరు పెద్దదా?" అడిగాను. "లేదమ్మా చిన్న ఊరే," న్నారు. కొంచం ఆశ్చర్యపోయాను. "చిన్నదంటే ఎంత ఊరు నాన్నా? మన ఇల్లంత ఉంటుందా?"

--->"సృజీ, మీది పెద్ద ఊరా?" అడిగింది స్వప్న. శర్మగారమ్మాయి. "అవును," అన్నా గర్వంగా. "అంటే మా ఇల్లంత ఉంటుందా?" అందా అమ్మాయి ఆశ్చర్యంగా.

:) :) :)

@Sujatha garu,

Very nice post. Keep going.

మరువం ఉష said...

సృజన ఒక్క నిమిషం మన్నించు, కాస్త సుజాత గారికి మాట అంటించి మన కథలోకి వస్తాను. " ప్రపంచంలో నరసరావు పేట వాళ్ళెక్కడున్నా" అంటే మా గోదావరి వాళ్ళని రెచ్చకొట్టిరచ్చలోకి ఈడ్వటానికేనా అంట, వున్న గోలలు చాలవా ఏమి? ;) సరే ఇది తర్వాత తేల్చుకుందాం. నేను కూడా మా మేనత్త గారు సంతమాగులూరులో వున్నపుడు అటువెళ్ళి "మీ" నరసరావుపేట కూడా చూసాను.

సృజన, మంచి అనుభవం, ఇంకొంచం అనుభూతి జోడించారల్లేవుందే. లేకపోతే 6సం. వయసుకే అంత గాఢమైన జ్ఞాపకమా? ;) విడ్డూరమైతే కాదు. మా తాతగారు వేటాడి తెచ్చిన కణుసుని చూసి నేను గగ్గోలు పెట్టి ఏడ్వటం నాకు బాగా గుర్తు. అప్పటికి నా వయసు 2సం పోతే కొన్ని నాకు అన్వయించుకునేంత సుమధురంగా వున్నాయి. మచ్చుకి, కొన్ని ...

0) చిన్నప్పుడు నాన్నతో వూరు వెళ్ళిన అనుభవం
1) "అవును. తను నా లిటిల్ ప్రిన్సెస్," నాన్న అన్నారు.
2) ఇప్పటికీ ఆ బొమ్మ ఉంది నా దగ్గర
3) నాన్న నవ్వుతూనే దాన్ని ఇవ్వనన్నారు

(1) నన్ను మా నాన్నగారు "మా చిన్న సీతమ్మ" అంటే మా నాయనమ్మతో పోల్చుకునేవారు. అంతకన్నా ఇంకేమి భాగ్యం కావాలి. మా నాన్న నాలో ఆయన తల్లిని దర్శించారు. నాకు యువ, స్నేహ ఆరు ప్రాణాలు, వాడు 5 తను ఆరో ప్రాణం.

(2) నేను పుట్టినపుడు బెనారస్ వెళ్ళిన తాతగారు అక్కడనుంచి వస్తూ తెచ్చి నా పొత్తిళ్ళలో వుంచిన సిల్క్ దుప్పటి ఇప్పటికీ నా తల క్రింద వుంచుకునే పడుకుంటాను. ఎన్నో సార్లు పాతదని పనివళ్ళో, వుతికేవారో దాన్ని పడేసినా వెదికి మరీ తెచ్చుకున్నాను. ఇప్పుడిక దాన్ని ఎవరినీ ముట్టుకోనీయను. అంత అపురూపం.

(3) నాన్న గారు ఆగ్రాలో తీయించుకున్న ఫొటో తనకి తెలియకుండా నేను తెచ్చుకున్నాను. 2007 లో నా దగ్గరకి వచ్చినపుడు చూసి అడిగి తీసుకువెళ్ళారు. తన అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాను. బదులుగా తన Engineering Degree Certificate ఇచ్చేసారు. అదొక అరుదైన వరం. ఆయన గురించి మీకు తెలియాలంటే నా కవిత "ఆ నాన్న కూతురు!!! " http://maruvam.blogspot.com/2009/06/blog-post_21.html లో వ్రాసాను.

చివరిగా (0) విలువ కట్టలేని అనుభూతి ఇది

నాకు మీ మాదిరే 6సం. వయసపుడు మొదటిసారి తన స్వంత వూరికి తీసుకెళ్ళారు నాన్న గారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరది. వూరు మొగల్లో ఎదురైన పూజారి హనుమాళీ గారికి నన్ను అప్పజెప్పి తను పొలాల వైపు వెళ్ళిపోయారు. ఆయన నాకు "అమ్మడూ ఇలా దక్షిణంగా వెళ్ళి, .." అంటూ నా కాన్వెంట్ బుర్రకి అర్థంకాని గుర్తులు చెప్పి ఓ సందు మొదల్లో వదిలి వెళ్ళిపోయారు. నేనలా మంద విడిచిన లేగదూడ మాదిరి అటూ ఇటూ తిరిగి ఒక అరుగు మీద కూర్చుని రామ నామ సంకీర్తన చేస్తున్న తాతగారిని "మలి, మా సీతమ్మామ్మ వాళ్ళ ఇల్లు తెలుసా తాత గారు మీకు" అని అడిగాను. ఆయన వున్న పళాన కన్నీరు మున్నీరైపోయి "నా చెల్లిని వెదుకుతూ ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావా తల్లీ, ఆ సీతమ్మ తల్లే నిన్నిలా పంపిందా" అని తెగ మురిసిపోయారు. తర్వాత తెలిసింది మా నాయనమ్మకి పెద్ద అన్నగారైన సూరయ్య తాతగారు ఆయన అని. పిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుని నాన్న గారితో పాటే వచ్చేసిన నాయనమ్మ మాతోనే వుండటంతో ఆ వూరు వెళ్ళటం తక్కువ. అయినా మీ అనుభవానికి సరిపడాది ఇదే అని అనిపించింది ఇంకా నాన్న గారితో కలిసి ఎన్నో వూర్లు వెళ్ళిన అనుభవాలు గుర్తుకి వచ్చినా కాని.

సుజాత వేల్పూరి said...

ఉషగారూ,
గోదావరి వాళ్ళు ఎంత అంటించినా లాభంలేదు. మా అత్తారిల్లు గోదావరే మరి!అందుకే సరదా పోటీలు పంతాలు ఎప్పుడూ గోదావరి వాళ్లతోనే!

మా వూరి గడియారం స్థంభం మీ చిన్నప్పటి జ్ఞాపకాల పాతరను కదిలించిందంటే అంతకంటే ఏం కావాలి మాకు? చదువుతూ చదువుతూ ఎక్కడికో వెళ్ళిపోయాను.స్మృతిలోకొచ్చి చూస్తే మా వూరి మధ్యలో ఉన్నాను. మధురంగా ఉన్నాయి మీ స్మృతులు.

గీతాచార్య said...

కిరా,

ఆరోజు నా బర్త్ ‍డే పార్టీలో కలిసిన పిల్ల, ఈ స్వప్నా ఒకరేనా?

ఇంతకీ నువ్వు చెపిన స్వప్న పీయేకే శర్మగారమ్మాయేనా? అలా ఐతే ఆ పిల్ల చాలా బాగుంటుంది. ;-)

భలే రాశావ్. ఐతే ఆ పార్కులో నన్ను చూసే ఉంటావ్.

మాలా కుమార్ said...

బాల్య స్మృతులు చాలా మధురంగా వున్నాయి.

Dhanaraj Manmadha said...

hmm nice account. reminds me of some past feeling of the valuble time I spent with my father. that clock tower is a big land mark, and was inseperable now too. I gather they call the centre 'గడియార స్థంభం' centre even after its demolition. I visited nrt long back.

nice and evenly paced narration. good effort.

Srujana Ramanujan said...

ముందుగా ఆలస్యానికి క్షమించాలి.

చివుకుల గారు,

మీకు ఆ ఊరి మీద చాలా అభిమానం ఉన్నట్టుందే
? :-) చిన్నప్పటి ఆలోచనలు చిత్రంగా ఉంటాయి కదూ.

చైతి,

ఏకాడా?


Nobody గారు,

:-)

Srujana Ramanujan said...

ఉష గారు,

ఇంత ఙ్ఞాపకాన్ని కదిలించానంటే... నిజంగానే నేను బాగా రాసినట్టు.

వేణూ శ్రీకాంత్ గారు,

మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

"నాకెందుకో మరి వీజీపీ, వైజాగ్ బీచ్ ఎన్ని చూసినా, మా పార్కే గొప్ప గా అనిపిస్తుంది :-) బహుశా ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయి ఉండచ్చు. అదే బాల్యం గొప్పతనమేమో!"

నిజమే కదా? :-)

దుర్గేశ్వర గారు,

ఆ ఊరి ప్రత్యేకత అదేనేమో మరి... :-)

ప్రియ,

మనం మాట్లాడేశాం కదా!

Srujana Ramanujan said...

మాలా కుమార్, సుజ్జి,

:-)

Dhana,

I know.

చంటి,

ఇంత రాసినా నీకు గుర్తుంది ఆ పిల్లేనా? ఇదేనా నీ పేట్రియాటిజం? Grrrrrrrrr

S, she is.

వైష్ణవి హరివల్లభ said...

సృజన గారూ,

ఏం రాశారండీ. చాలా హృద్యంగా ఉంది. అన్ని ఙ్ఞాపకాలని మాతో పంచుక్కున్న మీకు థాంక్స్.

@గీతాచార్య,

:-D

Srujana Ramanujan said...

@Vaishnavi,

Thanks for ur compliment.

@గీతాచార్య,

:-))))D

Madhu n Sankar said...

maadi kudaa nrt ne

సుజాత వేల్పూరి said...

@Madhu n Sankar,

మీరు కూడా నరసరావు పేటతో మీ అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఈ బ్లాగులో పంచుకోవచ్చుగా! అలాంటివి ఏమైనా ఉంటే gulabi98@gmail.com కి మెయిల్ చేయవచ్చు. మీ పేరుతోనే పబ్లిష్ అవుతాయి. ఈ బ్లాగు నరసరావు పేటవాళ్లందరిదీనూ!

గీతాచార్య said...

@Venusrikanth,

That is what is called నరసరావు’పేట్రియాటిజం’.

Your account on Narasaraopet plz...

మధురవాణి said...

సృజనా,
అంత చిన్నప్పటి జ్ఞాపకాల్ని చక్కగా గుర్తుంచుకుని ఇంత వివరంగా రాయగలగడం చాలా గొప్ప విషయం.
కుందేలు బొమ్మ చాలా బావుంది. ఇప్పటికీ భద్రంగా మీతోనే ఉంచుకున్నారంటే..అది మీకు ఎంత ప్రీతిపాత్రమైందో తెలుస్తోంది.
On the whole, a very well-written post.!

@ గీతాచార్య,
:)))

గీతాచార్య said...

ఇంతకీ నేనేం చెశాను? అంతా నామీద స్మైలీలు వేస్తున్నారు? :-(

అడ్డ గాడిద (The Ass) said...

Very nice account. chala hrudyamga undi. nice style, cute narration.